గన్నవరం నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్న గంజాయి స్మగ్లర్ అవతారం ఎత్తిన కానిస్టేబుల్ పడాల్ ఎట్టికేలకు చిక్కాడు. విజయనగరం జిల్లా నరవస గ్రామంలో తిరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పడాల్.. గత కొంతకాలంగా గంజాయి స్మగ్లర్ అవతారం ఎత్తాడు. ఇటీవల గంజాయి తరలిస్తూ గన్నవరం పోలీసులకు దొరికాడు. గతనెల 19న రిమాండులో భాగంగా గన్నవరం నుంచి రాజమండ్రి జైలుకు బస్ లో తరలిస్తుండగా తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా విజయనగరం జిల్లాలో ఉన్నట్టు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఒకసారి చింతపల్లిలో సిఐ గన్ ఎత్తుకెళ్లిన కేసు కూడా పడాల్ పై ఉంది.