హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతల కీలక నిర్ణయం

Update: 2019-11-18 15:02 GMT

ఆర్టీసీ సమ్మె లేబర్‌ కోర్టుకు చేరడంతో.. ఇటు ఆర్టీసీ ఏజేఏసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు దీక్షలు విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తరువాత మంగళవారం జరగనున్న ఆర్టీసీ కార్మికుల సడక్ బంద్ రద్దు చేయాలని నిర్ణయించాచు. జడ్జిమెంట్‌ తుది తీర్పు చదివిన తరువాత సమ్మెపై తుది నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు జేఏసీ నేతలతో దీక్ష విరమింపజేశామన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. నిరాహార దీక్షలు విరమించినా ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

జడ్జిమెంట్ కాపీ పూర్తిగా చదివిన తరువాత సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, మంగళవారం డిపోల దగ్గర నిరసన దీక్షలు కొనసాగుతాయి అన్నారు అశ్వత్థామరెడ్డి.

Similar News