ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఓ యాచకురాలు బాసటగా నిలిచింది. వేతనాలు లేక పస్తులుంటున్న కార్మికుల దుస్థితి చూసి చలించిపోయింది. భిక్షాటన చేస్తే వచ్చిన 4 వేల రూపాయలను వారికి అందించి ఔదర్యాన్ని చాటుకుంది. మిర్యాలగూడలోని మాటూరుకు చెందిన సైదమ్మ గత 30 ఏళ్లుగా ఆర్టీసీ బస్టాండ్ లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆర్టీసీ సమ్మెతో వేతనాలు రాక 44 రోజులుగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తన వద్ద ఉన్న 4 వేల రూపాయలను కార్మికుల కుటుంబాలకు అందజేసింది సైదమ్మ.