హైదరాబాద్ మెట్రో రైల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అమీర్‌పేటలో రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది. నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వైపు వెళ్తున్న మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి రైలు ఆగిపోయింది. విషయం తెలియగానే హుటాహుటిన మెట్రో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. అనంతరం రైలును పంపించేశారు. ఊహించని ఘటనతో ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అంతా బయటకొచ్చేశారు.