పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజున రెండు సభల్లోనూ గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే JNU వివాదంపై విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అటు సోనియా కుటుంబానికి SPG భద్రత తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభలో సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో రైతు సమస్యలపై శివసేన ఎంపీలు ఆందోళనకు దిగారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తొమార్ సమాధానం ఇస్తుండగా సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి సభ్యులు నినాదాలు చేశారు. ఓ దశలో సభ్యులపై స్పీకర్ ఓమ్ బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
రాజ్యసభలోనూ ప్రారంభం నుంచే గందరగోళం నెలకొంది. జేఎన్‌యూ వివాదం, కశ్మీర్ అంశం, మార్షల్స్ డ్రెస్‌కోడ్‌పై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.