సమాచారం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం కేసీఆర్ చెప్పారని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. సీఎం ఏం చెప్పారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని అభిప్రాయపడింది.
ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా?అనేది న్యాయస్థానం ముందున్న అంశమని వ్యాఖ్యానించింది హైకోర్టు. ప్రభుత్వం చట్ట పరమైన ప్రక్రియ అనుసరిస్తుందా లేదా అనేది తెలియకుండానే చట్ట విరుద్ధమని ఎలా ప్రకటిస్తామని ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం.. ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. మార్పులు చేస్తే గెజిట్ లో ప్రచురించాలని, స్థానిక దినపత్రికల్లోనూ ప్రచురించాలని న్యాయవాది చెప్పారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని ప్రశ్నించింది.
ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో దేశంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేదని.. ఆ తర్వాత చాలా ప్రైవేటు ఎయిర్ లైన్స్ విజయవంతమయ్యాయని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.