డిసెంబర్ 1న BCCI సర్వసభ్య సమావేశం జరగనుంది. సుదీర్ఘ విరామం తరువాత గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌లో.. పాలనా వ్యవహారాలలో భారీ మార్పుల దిశగా చర్యలు తీసుకోనున్నారు. చీఫ్ సెలక్టర్ MSK ప్లేస్‌లో కొత్తగా వేరొకరిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఛీఫ్ సెలక్టర్ రేసులో మాజీ లెగ్ స్పిన్నర్ ఎల్. శివరామకృష్ణన్ ఉన్నారు. అలాగే.. ఏపీ విషయానికి వస్తే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాల్లోనూ పెనుమార్పులు ఉండొచ్చంటున్నారు.