ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటా సర్వే

Update: 2019-11-20 03:00 GMT

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి సర్వే జరగనుంది. ఇవాల్టి నుంచి డిసెంబరు 20 వరకూ సమగ్రంగా వివరాలు సేకరించి అర్హులను ఎంపిక చేస్తారు. YSR నవశకం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఈ ఇంటింటి సర్వే చేయనున్నారు. నవరత్నాలు ప్రతిఒక్క పేద కుటుంబానికీ అందించాలనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఈసారి ప్రభుత్వ కార్డుల జారీలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. రేషన్‌ బియ్యం అందచేసేందుకు ఒక కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరోకార్డు, ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీకి ఒక కార్డు ఇస్తారు.

ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారంతా ఆయా పథకాలకు లబ్దిదారులు అవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కం ట్యాక్స్‌ పేయర్లు కాకుండా మిగతా వారంతా 5 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఈ కార్డు పొందవచ్చని అధికారులు తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా ఒక కారు ఉన్నా సరే ఆరోగ్యశ్రీకి అర్హులే. వీటితో పాటు విద్యా దీవెన ద్వారా అమ్మఒడి, ఇతర స్కాలర్‌షిప్‌లు, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణకు హాజరయ్యేవారికి కూడా కార్డులు అందిస్తారు. వసతి దీవెన కార్డు ద్వారా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు కూడా వీటిని జారీ చేస్తారు.

Similar News