హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ హరిణి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు మరికొంతమందికి ఐటీ కంపెనీ నోటీసులు జారీ చేసింది. దీంతో హరిణి తీవ్ర మనస్తాపం చెందింది. గచ్చిబౌలిలో తాను ఉండే హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.