ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను.. రాష్ట్రం నుంచి తరలించడమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లకు ఉపాధి ఉంటే చాలని జగన్ భావిస్తున్నారని అనురాధ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ జగన్ యువతను మోసం చేశారన్నారు. జగన్ వచ్చాక తాడేపల్లి గంజాయికి అడ్డగా మారిందని ఆరోపించారు పంచుమర్తి అనురాధ.