వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సీఎం జగన్ ప్రారంభించారు. గంగ పుత్రుల జీవితాలు మార్చే నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం. ప్రజల బాధలను తీర్చడానికి సీఎం సీటులో ఉన్నానని తెలిపారు జగన్. ఈ పథకం ద్వారా లక్షా 36 వేల మంది మత్స్యకారులు లబ్ది పొందుతారని తెలిపారు. చేపల వేట నిషేధకాల సమయంలో ప్రతీ మత్స్యకార కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు జగన్. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపలవేటపై నిషేధం విధించామన్నారు.