అయ్యప్పమాల వేసుకున్న నాయకుడితో మమ్మల్ని తిట్టిస్తున్నారు : దేవినేని ఉమ

Update: 2019-11-21 05:39 GMT

టీడీపీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా ఖండించారు. టీడీపీని తిట్టించడానికే దారుణమైన భాష వాడుతున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాల వేసుకున్న నాయకుడితో మమ్మల్ని తిట్టిస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. మత విశ్వాసాలను వైసీపీ కించపరుస్తోందన్నారు. పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారన్నారు. గిన్నిస్ రికార్డులకెక్కిన సంస్థల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకాసురులపై చర్యలకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని ఉమ వ్యాఖ్యానించారు.

Similar News