హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు పనిచేస్తే తప్పేంటి: అవంతి శ్రీనివాస్

Update: 2019-11-22 06:08 GMT

దేవుడిని, మతాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్‌. అది ఎవరికీ మంచిదికాదన్నారు. ఇప్పటి వరకు ఇసుక, ఇంగ్లీష్. ఇప్పుడు కొత్తగా జెరూసలెం యాత్రను విపక్షాలు రాజకీయం చేయడం మానాలని హితవు పలికారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ జంక్షన్‌లో మాజీ మంత్రి దివంగతనే గుడివాడ గుర్నాథరావు వర్ధంతిలో పాల్గొన్న ఆయన.. విపక్షాల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగాలు చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు.

Similar News