క్రూయిజ్ ట్రిప్పుల కోసం ఒకప్పుడు సింగపూర్, బ్యాంకాక్.. కానీ ఇప్పుడు..

Update: 2019-11-22 03:39 GMT

ముంబై నగరంలోని సముద్ర జలాల్లో తొలిసారిగా క్రూయిజ్ షిప్ సందడి చేసింది. ముంబైవాసులకు అధ్బుతమైన అనుభూతులు పంచింది జలశ్.. సముద్ర అలల్లో తేలియాడుతూ మైమరసిపోయారు పర్యాటకులు. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న క్రూయిజ్ రైడ్ ఇప్పుడు ముంబైలో అందుబాటులోకి వచ్చింది. జలశ్ పేరుతో అతిపెద్ద క్రూయిజ్ ముంబై జలాల్లో తేలియాడుతోంది. సముద్ర స్వర్గంలో అధ్బుత అనుభూతులను పర్యాటకులు సొంతం చేసుకుంటున్నారు.

సినిమాల్లో మాత్రమే చూసిన క్రూయిజ్ అనుభవం అధ్బుతంగా ఉందంటున్నారు ప్రయాణీకులు. జలశ్ లో ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభవంగా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రయాణీకులు సైతం క్రూయిజ్ ఎక్కేందుకు ఆసక్తిచూపుతున్నారు. క్రూయిజ్ ట్రిప్పుల కోసం ఒకప్పుడు సింగపూర్, బ్యాంకాక్ వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ముంబైలో అందుబాటులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News