ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ ఆంశంపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడటంపై మానసిక వేదనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే అసెంబ్లీ జరిగినన్ని రోజులు తమకు కేటాయించిన ఫ్లాట్ల వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. ముఖ్యమంత్రి సానుకూల ప్రకటన చేస్తే ఆందోళన విరమించుకుంటామని రైతులు చెబుతున్నారు.