తిరుపతిలో చిరుత కనిపించి కలకలం సృష్టించింది. అలిపిరి సమీపంలోని దివ్యారామం నర్సరీ వద్ద వాకర్స్‌కు చిరుత కనిపించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. హఠాత్తుగా చిరుత కనిపించడంతో.. ఆందోళనకు గురైన స్తానికులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు..చిరుత కోసం గాలించారు. గతంలోనూ ఈ దివ్యారామం నర్సరీ వద్ద చిరుత కనిపించినట్లు చెబుతున్నారు.