హైదరాబాద్‌లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్‌పై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందపడిపోయింది. ఫ్లై ఓవర్ నుంచి కారు ఒక్కసారిగా కిందపడటంతో ఫ్లై ఓవర్ కింద ఉన్న మహిళ అక్కడిక్కడే చనిపోయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో రెండు కార్లు నుజ్జునజ్జుయ్యాయి.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడింది. ప్రమాద సమయంలో ఫ్లై ఓవర్ కింద ఓ మహళ నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెపై కారు పడటంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఫ్లై ఓవర్ కింద ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఈ వారంలో ఇది రెండో ప్రమాదం. ఇటీవలే ఈ ఫ్లైఓవర్ నుంచి కింద పడి ఇద్దరు చనిపోయారు.