షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి - కిషన్ రెడ్డి
ఎలాంటి కండిషన్లు లేకుండా ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. దీపావళి నుంచి ఆగిపోయిన జీతాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇటు మహారాష్ట్ర రాజకీయాలపైనా ఆయన స్పందించారు. శివసేన ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించదని.. అందుకే ప్రజా తీర్పును గౌరవించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ నెల 30వ తేదీన సభలో బీజేపీ బలం నిరూపించుకుంటుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.