నీ సంతోషం కోసం రోజూ నేను..

Update: 2019-11-23 09:28 GMT

 

స్వీట్ కపుల్ సామ్, చైతూ అంటే అభిమానులకు అదో సరదా. మా ఆయన ఇలా.. అలా అంటూ సమంత వాళ్లిద్దరికీ సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా ఆసక్తిగా చదువుతారు. చైతూ 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో భర్తకు శుభాకాంక్షలు చెబుతూ సామ్ ఓ పోస్ట్ పెట్టింది. 'నువు సంతోషంగా ఉండాలని దేవుడికి రోజూ ప్రార్థన చేస్తున్నాను. నీ కెరీర్‌లో మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వ్యక్తిత్వాన్ని చూసి ముచ్చటపడుతుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. నువు నా భర్తవి కావడం నా అదృష్టం. మన బంధం చాలా ధృఢమైనదని నమ్ముతున్నాను. ఐ లవ్ యూ డార్లింగ్' అని రాస్తూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

నాగచైతన్య బర్త్‌డే కానుకగా శేఖర్ కమ్ముల డైరక్షన్లో అతడు నటిస్తున్న చిత్ర పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాగ చైతన్య మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటించనుంది.

Similar News