మంత్రి మల్లారెడ్డికి ఆర్టీసీ సమ్మె సెగ

Update: 2019-11-23 13:10 GMT

తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌ రాణిగంజ్‌ డిపో నుంచి ప్యారడైజ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శనతో పాటు మోకాళ్లతో నడుస్తూ నిరసనలు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్ని సైతం అడ్డుకున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఆర్టీసీ కార్మికులు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ తమ డిమాండ్లను పరిష్కరించి.. తమను మళ్లీ విధుల్లో తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

Similar News