దీప్తిశ్రీ హత్య.. ఘాతుకానికి పాల్పడ్డ సవతి తల్లి

Update: 2019-11-24 07:25 GMT

కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీని సవతి తల్లి శాంతకమారి హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నం దీప్తిశ్రీ కిడ్నాప్‌నకు గురైంది. తమ చిన్నారిని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారే అంటూ దీప్తిశ్రీ నాయయన్మ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. శాంతి కుమారిని అదుపులో తీసుకుని ప్రశ్నించారు. విచారణలో దీప్తి శ్రీని హత్య చేసినట్లునేరం అంగీకరించింది శాంతి కుమారి. స్కూల్‌ విద్యార్ధులు, వృద్ధాశ్రమంలో ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. దీప్తిశ్రీని శాంతకుమారి తీసుకెళ్లినట్లు జగన్నాథపురం నేతాజీ మున్సిపల్‌ స్కూల్ విద్యార్ధులు గుర్తు పట్టారు.

Similar News