చింతల్‌లో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కి కరెంట్ పోల్‌ను ఢీకొని..
హైదరాబాద్‌లోని చింతల్‌లో షా థియేటర్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. సిటీ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిటీ బస్సు గండిమైసమ్మ చౌరస్తా నుంచి సికింద్రాబాద్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
షా థియేటర్ వద్ద అప్పటికే రోడ్డుపై ఒక ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఆ రెండు వాహనాలు రోడ్డుపై ఉండగానే... వెనక నుంచి సిటీ బస్సు వేగంగా వచ్చింది. టెంపరరీ డ్రైవర్ ప్రతాప్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు మధ్యనున్న డివైడర్‌పైకి ఎక్కించాడు. దీంతో డివైడర్‌పైకి ఎక్కిన బస్సు కరెంట్ పోల్‌ను ఢీకొని నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కాసేపు ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వచ్చి క్లియర్ చేశారు.