ఏపీలో ఆశా వర్కర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కొత్త ప్రభుత్వం ప్రతి నెలా 10 వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి.. కేవలం 7200రూపాయలు చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన 2800 రూపాయలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారని నిలదీశారు. అలాగే ఎలాంటి జీవో లేకుండా పదో తరగతి లోపు చదివిన ఆశా వర్కర్లను, 60ఏళ్లు దాటిన ఆశా వర్కర్లను ఎలా తొలగిస్తారని నిలదీశారు.