మంగమ్మ శపథం.. మగపిల్లాడి కోసం 12 సార్లు..

Update: 2019-11-25 08:58 GMT

సమాజం మారోతోంది అంటున్నారు. కానీ మనిషి ఆలోచనలు అలాగే ఉంటున్నాయి. ఇంకా ఆడమగ బేధాలు.. అమ్మాయి పుడితే ఆమెనే తప్పు పట్టడం.. అబ్బాయి పుడితే లాటరీలో లక్షలు గెలుచుకున్నంత సంతోషం.. అబ్బాయి కోసం ఎంతమంది పిల్లల్నైనా కనడం.. ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా పెడ చెవిన పెడుతూనే ఉన్నారు. రాజస్థాన్ చురు జిల్లాలో 42 ఏళ్ల వయసున్న గుడ్డీకి ఇప్పటికే 11 మంది ఆడపిల్లలు.

అందులో ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అయినా ఆమె అమ్మ అయి అబ్బాయిని కన్నది. వారసుడొచ్చాడని తెగ మురిసిపోతోంది. వాడిని చూసి ఇప్పటి వరకు తను పడిన కష్టమంతా మర్చిపోతోంది. ఇరుగు పొరుగు అవహేళనలు, బంధువుల ఈసడింపులు.. అందరూ అమ్మాయిలేనా.. ఈ సారైనా అబ్బాయిని కనవే తల్లీ అంటూ ఉచిత సలహాలు.. వారికి సమాధానం చెప్పాలనే అబ్బాయి కోసం ఎదురు చూసి ఇంతమందని కనాల్సి వచ్చిందని అంటోంది గుడ్డీ. అమ్మా.. నీకు హాట్సాఫ్ తల్లీ ఒకళ్లనీ, ఇద్దరినీ కనేసరికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది.. ఏకంగా 12 మందిని కని వాళ్లని పెంచి, పెద్దచేసేసరికి ఒళ్లు హూనం గ్యారెంటీ.

Similar News