ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు సంతోషాన్నిచ్చాయి : రాజధాని రైతులు

Update: 2019-11-26 12:37 GMT

విజయవాడలోని సీఆర్డీఏ కమిషనర్‌ కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు రాజధాని రైతులు. రాజధానిలో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి పనులు కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు చాలా సంతోషాన్నిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన సీఆర్డీఏ కమిషనర్‌ను కలిసి రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందన్న ఆశాభావం తమకు ఉందంన్నారు. సీఎం జగన్‌ ఎక్కడా రాజధాని తరలింపుపై మాట్లాడలేదని.. కావాలని కొందరు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారంటున్నారు.

Similar News