టీడీపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డవారిని కలిసిన చంద్రబాబు.. వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని.. అరాచకం, అబద్దాలు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని.. ఇష్టారాజ్యంగా జీవోలు ఇస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. మంత్రులు బాధ్యత మరిచి.. బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.