ప్రజల ముందుకు రాకుండా ట్విట్టర్‌లో కొత్త ఆరోపణలా : మంత్రి బొత్స

Update: 2019-11-26 11:50 GMT

గత ఐదేళ్ల పాటు టీడీపీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 4 శాతం నిధులు మాత్రమే రాజధానికి ఖర్చు చేశారని ఆరోపించారు. మరోవైపు తీరని రెవెన్యూ లోటుతో రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేవారు. మరో 20 ఏళ్లు అయినా ఆ లోటు తీర్చడం కష్టం అన్నారు బొత్స. కేవలం తన సొంత లాభం కోసమే చంద్రబాబు పాటుపడ్డారు.. తప్ప రాష్ట్రానికి ఏం చేయలేదని ఆరోపించారు. ప్రజల ముందుకు రాకుండా.. చంద్రబాబు, లోకేష్‌, యనమల ఇతర టీడీపీ నేతలు ట్విట్టర్‌లో కొత్త ఆరోపణలు చేస్తున్నారంటూ బొత్స ఎద్దేవ చేశారు.

Similar News