అవినీతి అధికారులకు కేంద్రం షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఆదాయపన్నుశాఖలో పనిచేస్తున్న 85 మంది ఐటీ అధికారులపై నిర్బంధ పదవీవిరమణ చేయించి ఇంటికి పంపుతోంది. ఇందులో ఇద్దరు ఏపీకి చెందిన అధికారులున్నారు. రాజమండ్రిలో ఇన్ కం ట్యాక్స్ మహిళా అధికారిణితో పాటు.. విశాఖపట్నానికి చెందిన మరో ఐటి అధికారి ఉన్నారు. గతంలో లంచాలు తీసుకుంటూ వీరు సీబీఐకి చిక్కారు. రాజమండ్రి అధికారిణి లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడగా.. విశాఖ అధికారి 75వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వీరిపై గతంలోనే సీబీఐ కేసులు నమోదు చేసింది. మంగళవారం రాత్రి వీరితో పాటు మొత్తం 21మందిని నిర్బంధ పదవీ విరమణ కింద ఇంటికి పంపుతున్నట్టు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.