కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంపై కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రైలర్‌లో తనను కించపర్చేలా చూపించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశించాలని.. చిత్రం విడుదల కాకుండా స్టే విధించాలని కేఏ పాల్ కోరారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కించపరిచేలా చిత్రం తీశారని.. అందుకు తగ్గ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఐతే.. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని.. ఈ చిత్రంపై రివ్యూ నడుస్తోందని చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది. గురువారం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం పూర్తి వివరాలు ఇవ్వలన్న హైకోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.