నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్‌పై కేసు నమోదు అయింది. ఎమ్మెల్యేతో పాటు.. అతని సోదరుడు సొహెల్, మరో 8 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆచన్‌పల్లికి చెందిన ముగ్గురు యువకులు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఇసుక తరలింపు వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు కూడా.. ప్రత్యర్థి యువకులపై ఫిర్యాదు చేశారు. దొంగతనం చేశారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులతో ఇరు వర్గాలపైనా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.