REVANTH: స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే..కోర్టుకు వెళ్లండి

ఫిరాయింపులపై స్పందించిన సీఎం రేవంత్‌... సర్వాధికారులు స్పీకర్‌కే ఉంటాయన్న సీఎం... ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టీకరణ

Update: 2025-12-19 04:15 GMT

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో గత కొం­త­కా­లం­గా ప్ర­కం­ప­న­లు సృ­ష్టి­స్తు­న్న ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యేల అం­శం­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. శా­స­న­స­భ­లో సభ్యుల సం­ఖ్య, వారి హోదా, పా­ర్టీ మా­ర్పు­ల­పై ని­ర్ణ­యం తీ­సు­కు­నే సర్వా­ధి­కా­రా­లు కే­వ­లం శా­స­న­సభ స్పీ­క­ర్‌­కు మా­త్ర­మే ఉం­టా­య­ని.. అం­దు­లో ప్ర­భు­త్వం జో­క్యం చే­సు­కో­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. స్పీ­క­ర్ తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­ల­ను తప్పు­బ­డు­తు­న్న ప్ర­తి­ప­క్ష పా­ర్టీ­ల­కు ఆయన సూ­టి­గా సవా­ల్ వి­సి­రా­రు. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి గు­రు­వా­రం మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. శా­స­న­సభ ని­బం­ధ­నల ప్ర­కా­ర­మే ప్ర­తి అంశం జరు­గు­తుం­ద­ని వి­వ­రిం­చా­రు.

అసంతృప్తి ఉంటే..

స్పీ­క­ర్ ని­ర్ణ­యం పట్ల ఎవ­రి­కై­నా అసం­తృ­ప్తి ఉంటే.. ప్ర­జా­స్వా­మ్యం­లో న్యా­య­స్థా­నా­లు ఉన్నా­య­ని.. అక్క­డి­కి వె­ళ్లి తమ వా­ద­న­లు వి­ని­పిం­చు­కో­వ­చ్చ­ని సూ­చిం­చా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి 37 మంది ఎమ్మె­ల్యే­లు ఉన్నా­ర­ని ఆ పా­ర్టీ నా­య­కు­డు హరీ­ష్ రావు స్వ­యం­గా ప్ర­క­టిం­చా­ర­ని రే­వం­త్ గు­ర్తు­చే­శా­రు. సభలో సభ్యుల సం­ఖ్య­ను బట్టి స్పీ­క­ర్ బు­లి­టె­న్ వి­డు­దల చే­సి­న­ప్పు­డు మౌ­నం­గా ఉండి.. ఇప్పు­డు రా­జ­కీయ లబ్ధి కోసం రచ్చ చే­య­డం సరి­కా­ద­ని మం­డి­ప­డ్డా­రు. బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ ప్ర­స్తు­తం క్రి­యా­శీల రా­జ­కీ­యా­ల­కు దూ­రం­గా ఉం­డ­టం­తో ఆ పా­ర్టీ­లో క్ర­మ­శి­క్షణ కరు­వైం­ద­ని ఎద్దే­వా చే­శా­రు. గజ్వే­ల్ ప్ర­జ­లు సైతం తమ నా­య­కు­డి­పై ఆశలు వదు­లు­కు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. తె­లం­గా­ణ­లో ఇటీ­వల జరి­గిన గ్రామ పం­చా­య­తీ ఎన్ని­కల ఫలి­తా­లు కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం చే­ప­ట్టిన ప్ర­జా­పా­ల­న­కు ని­ద­ర్శ­న­మ­ని సీఎం ధీమా వ్య­క్తం చే­శా­రు.

రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా జరి­గిన ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ పా­ర్టీ తన రె­బ­ల్ అభ్య­ర్థు­ల­తో కలి­పి దా­దా­పు 66 శాతం స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కుం­ది. మొ­త్తం 12,702 సర్పం­చ్ స్థా­నా­ల్లో కాం­గ్రె­స్ తన ఆధి­ప­త్యా­న్ని చా­టు­కుం­ది. ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ , బీ­జే­పీ లో­పా­యి­కా­రీ ఒప్పం­దం­తో కూ­ట­మి­గా పోటీ చే­సి­న­ప్ప­టి­కీ, ప్ర­జ­లు వా­రి­ని తి­ర­స్క­రిం­చా­ర­ని రే­వం­త్ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. కే­వ­లం 33 శాతం స్థా­నా­ల­కే ఆ కూ­ట­మి పరి­మి­త­మైం­ద­ని గణాం­కా­ల­తో సహా వి­వ­రిం­చా­రు.రా­ష్ట్రం­లో­ని 94 అసెం­బ్లీ ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఎన్ని­క­లు జర­గ­గా.. అం­దు­లో 87 ని­యో­జ­క­వ­ర్గా­ల్లో కాం­గ్రె­స్ స్ప­ష్ట­మైన ఆధి­క్యం సా­ధిం­చిం­ద­ని.. ఇది ప్ర­భు­త్వ పని­తీ­రు­కు ప్ర­జ­లు ఇచ్చిన సర్టి­ఫి­కే­ట్ అని ఆయన కొ­ని­యా­డా­రు.

అధి­కా­రం కో­ల్పో­యి­నా....

ప్ర­తి­ప­క్ష నే­త­లు అధి­కా­రం కో­ల్పో­యి­నా అహం­కా­రం వీ­డ­టం లే­ద­ని రే­వం­త్ రె­డ్డి ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. మూసీ నది కా­లు­ష్యం కంటే కొం­ద­రు ప్ర­తి­ప­క్ష నేతల మన­సు­ల్లో­నే ఎక్కువ విషం పే­రు­కు­పో­యిం­ద­ని ధ్వ­జ­మె­త్తా­రు. ఇం­ది­ర­మ్మ ఇళ్లు, ని­రు­ద్యో­గు­ల­కు ఉద్యో­గాల కల్పన వంటి పథ­కాల వల్ల­నే గ్రా­మీణ తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్‌­కు భారీ ఆదరణ లభిం­చిం­ద­ని చె­ప్పా­రు. ఉపా­ధి హామీ పథ­కా­న్ని ని­ర్వీ­ర్యం చే­సేం­దు­కు కేం­ద్ర ప్ర­భు­త్వం కు­ట్ర­లు చే­స్తోం­ద­ని.. సో­ని­యా గాం­ధీ, రా­హు­ల్ గాం­ధీ­ల­పై అక్రమ కే­సు­లు పె­ట్టి వే­ధి­స్తోం­ద­ని ఆరో­పిం­చా­రు. రా­బో­యే 2029 ఎన్ని­క­ల్లో­నూ తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్ పా­ర్టీ­యే జయ­కే­త­నం ఎగు­ర­వే­స్తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి ధీమా వ్య­క్తం చే­శా­రు.

Tags:    

Similar News