రౌడీలతో దాడి చేయిస్తారా : చంద్రబాబు ఆగ్రహం

Update: 2019-11-28 16:04 GMT

రాజధానిపై తాను యుద్ధం చేయడానికి అమరావతి రాలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధానిలో జరిగిన అభివృద్ధి.. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఐదు కోట్ల మంది ప్రజలకు తెలియచేయాలనే సంకల్పంతోనే వచ్చానన్నారు. అమరావతి పర్యటన ముగిసిన తర్వాత ఆయన వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. రాజధానిని చంపేస్తారా అని నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని తనపై రౌడీలతో దాడి చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News