విశాఖ మెట్రో ప్రాజెక్టుపై కదలిక

Update: 2019-11-30 14:01 GMT

విశాఖ మెట్రో ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. గాజువాక- కొమ్మదిల మధ్య మెట్రో కారిడార్‌ ప్రాంతాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. మొదటి డీపీఆర్‌లో కొద్దిపాటి సవరణలు చేయాలని రివ్యూలో అధికారులకు పలు సూచనలు చేశారు. కూర్మన్నపాలెం నుంచి కొమ్మది వరకు మొదటి కారిడార్‌ని పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌ 3న సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.

Similar News