యువకుడిని చెప్పుతో కొట్టిన మహిళ

Update: 2019-12-01 09:28 GMT

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లిలో ఆకతాయికి దేహశుద్ధి చేసిందో మహిళ. సాయి అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ చెప్పుతో కొట్టింది. స్థానికులు ఆమెకు మద్దతు తెలిపారు. కొన్నాళ్లుగా తన వెంటపడుతున్నాడని.. వేధిస్తుండంటూ బాధితురాలు వాపోయింది. పోకిరీలు, ఆకతాయిలకు తగిన శాస్తి జరిగితే.. జీవితంలో ఎప్పుడూ మరొకరి వెంట పడరని స్థానికులు అన్నారు.

Similar News