అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాకు కొత్త చిక్కు

Update: 2019-12-09 13:51 GMT

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాను సెన్సార్‌ చిక్కులు వీడి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలో రాంగోపాల్‌ వర్మను మరో వివాదం చుట్టుముట్టింది. కేఏపాల్‌ కోడలు.. ఆర్జీవీపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌ కోసం తమ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాడుకున్నారని జ్యోతి ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ప్రణబ్‌ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి దిగిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఆమె ఆరోపించింది. ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని.. ఆ ఫొటోలను వెంటనే తొలగించాలని జ్యోతి డిమాండ్‌ చేసింది. ఐపీసీ 469 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. ఐపీ నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ నెంబర్‌ తెలుసుకునేందుకు గూగుల్‌ సంస్థకు లేఖ రాశారు.

Similar News