మార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఖండించారు. తాను బ్రతికి ఉన్నంత వరకూ బీజేపీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. అయితే తన కుమారుడు రంగరాజు, ఇద్దరు సోదరులు రామరాజు, నరసింహారాజు మాత్రమే వైసీపీలో చేరుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తన కొడుక్కి వైసీపీ, టీడీపీల నుంచి పిలుపు వచ్చినా.. ఎంపీ సీటు ఆఫర్ చేసినా.. తను నా గురించి అలోచించి తన ఆలోచనను విరమించుకున్నారని అన్నారు.