నెల్లూరు సంగం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న ఇద్దరు సీనియర్ డాక్టర్లు సెలవులో ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో రోగులను చూడాల్సిన బాధ్యతను.. తాత్కాలికంగా పని చేస్తున్న జూనియర్ డాక్టర్లకు అప్పగించారు ఉన్నతాధికారులు. అయితే బాధ్యతగా రోగులకు వైద్యం చేయాల్సిన జూనియర్ డాకర్లు.. వారిని పట్టించుకోకుండా ఆస్పత్రి ఆవరణలో ఆటలాడుకుంటున్నారు. దీంతో వైద్యుల తీరుపై రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు.