ఏపీలో ఉల్లి కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ప్రజల నిత్యావసరాల సరకులను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. కానీ జగర్ రెడ్డి గారు చేసే మేలు.. ఉల్లి కూడా చెయ్యదు.. అందుకే ఉల్లి ఎందుకు అనవసరం అని, దాని రేటు పెంచేశారు అంటూ ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఉల్లి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతు బజార్ల వద్ద కిలో మీటర్ల మేర బారులు తీరుతున్న ప్రజలే ఇందుకు తార్కారణం అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పవన్.