విజయవాడ దుర్గమ్మ దేవస్థానం పేరుతో 3 నకిలీ వెబ్ సైట్లు ఉండటం కలకలం రేపుతోంది..దేవాలయానికి సంబంధం లేని వ్యక్తులు అమ్మవారి ఆర్జిత సేవలు, అన్నదానం పేరుతో ఈ నకిలీ సైట్లు నడుపుతున్నారని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు దుర్గగుడి ఈవో సురేష్ బాబు. ఈ నకిలీ సైట్లను ఎవరూ నమ్మొద్దని సూచించారు. కొండపై హల్‌చల్ చేస్తున్న నకిలీ ఉద్యోగులపైనా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు దుర్గగుడి ఈవో సురేష్‌బాబు.