అల్జేరియా కోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు మాజీ ప్రధానులకు జైలు శిక్ష

Update: 2019-12-10 12:18 GMT

అల్జేరియా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికలకు రెండురోజుల ముందు ఇద్దరు మాజీ ప్రధానులకు జైలు శిక్షలు విధించింది. దేశంలో జరుగుతున్న ఆందోళనకు ముగింపు పలికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నాలుగు సార్లు ప్రధానిగా పనిచేసిన అహ్మద్ ఓయాహియ కు 15సంవత్సరాలు, రెండుసార్లు ప్రైమిస్టర్ గా చేసిన అబ్దుల్ మాలిక్ సెల్లాల్ కు 12 సంవత్సరాలు శిక్షను ఖరారుచేసింది. వీరు పదవుల్లో ఉండగా ప్రజాధనం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో .....ఈ శిక్షలు విధించినట్లు తెలిసింది. అవినీతి అక్రమాల ఆరోపణలతో ఇప్పటికే ఇద్దరు పరిశ్రమలశాఖ మాజీ మంత్రులు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు.

Similar News