Sunita Williams: సునితా విలియమ్స్ స్పేస్‌జర్నీకి బ్రేక్
స్టార్‌లైనర్ ప్రయోగం నిలిపివేత..;
ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ నింగి యాత్రకు బ్రేక్ పడింది. బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయోగాన్ని చివరి నిమిషంలో ఆపేశారు. దీంతో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెఢీ అయిన సునితా విలియమ్స్ ప్రయాణానికి బ్రేక్ పడింది. అయితే ఈ ప్రయోగానికి చెందిన కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అట్లాస్ వి రాకెట్‌లోని సెకండ్ స్టేజ్‌లో ఉండే ఆక్సిజన్ వాల్వ్ లీకేజీ కావడంతో ప్రయోగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి స్టార్‌లైనర్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ వ్యోమనౌక లిఫ్ట్ ఆఫ్ కావడానికి రెండు గంటల ముందే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్ వాల్వ్ లీక్ కావడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు బోయింగ్ సంస్థ ప్రకటించింది. సునితా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారీ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉన్నది.
సునితా విలియమ్స్ ఇప్పటికే రెండు సార్లు స్పేస్ జర్నీ చేశారు. ఆ ఆస్ట్రోనాట్ నింగిలో 322 రోజులు గడిపారు. ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా ఆస్ట్రోనాట్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. తొలిసారి డిసెంబర్ 9, 2006లో ఆమె స్పేస్‌జర్నీ చేశారు. మొదటిసారి ఆమె జూన్ 22, 2007 వరకు స్పేస్ స్టేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత రెండో సారి జూలై 14 నుంచి నవంబర్ 18, 2012 వరకు ఉన్నారు.
ఆమె గతంలో 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లి మొత్తం 322 రోజులు గడిపారు. ఆమె 50 గంటల 40 నిమిషాల ఏడు అంతరిక్ష నడకలతో మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించింది. ఆమె అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణేశుడి విగ్రహం, ఉపనిషత్తులతో పాటు సమోసాలను తీసుకువెళ్లడం విశేషం. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ దానిని బద్దలు కొట్టింది. సునీత అమెరికాలోని ఓహియోలోని యూక్లిడ్‌లో భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా దంపతులకు జన్మించింది. దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా నుంచి అమెరికాకు వెళ్లారు. సునీత 1987లో యూఎస్ నేవీలో నియమితులయ్యారు. దీని తర్వాత, అతను 1988లో వ్యోమగామిగా నాసాలో ఎంపికయ్యారు.