గిరిజనులతో గవర్నర్‌ తమిళిసై మాటామంతీ

Update: 2019-12-10 15:54 GMT

జిల్లాల పర్యటనలో భాగంగా రెండో రోజు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు గవర్నర్‌ తమిళిసై. కాటారం మండలం బోడగూడెంలో గిరిజనలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం, మిషన్ భగీరథ పైపులైన్‌ నిర్వహణను పరిశీలించారు. గవర్నర్‌ దంపతులకు డప్పు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామంలోని లక్ష్మిదేవి గుడిలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు..

గవర్నర్‌గా కాదు మీ సోదరిగా బోడగూడెం వచ్చానని చెప్పారు గవర్నర్ తమిళిసై. బోడగూడెం గ్రామస్థులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చి ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా బోడగూడెం ఆదివాసీలను ఆహ్వానించారు గవర్నర్. గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు డ్రెస్సులు, బ్యాగులు పంపిణీ చేశారు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన కన్నెపల్లి పంపుహౌజ్‌, లక్ష్మి బ్యారేజ్‌ను పరిశీలించారు తమిళిసై . ప్రాజెక్టు విశిష్టతను గవర్నర్‌కు వివరించారు అధికారులు.. అంతకుముందు... శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి క్షేత్రాన్ని దర్శించారు..అర్చకులు గవర్నర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Similar News