హెరిటేజ్‌లో ఉల్లి ధరల పెరుగుదలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఒక గృహిణిగా ఉల్లి రేట్ల విషయంలో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు ఇంత భారీగా పెరగడం ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు భువనేశ్వరి.