అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా.. అంగట్లో ఆట బొమ్మలనుకుంటున్నావా. ఇష్టం లేదు మొర్రో అంటే వెంట పడతారు.. కాదంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఇదే రోడ్డు మీద మీ అక్క, చెల్లెళ్లు కూడా నడుస్తుంటార్రా. మీలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు అని ఆకతాయికి దేహశుద్ధి చేసింది మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా. కాన్పూర్‌లోని బీతూర్‌లో స్కూల్‌కి వెళుతున్న బాలికలను ఓ యువకుడు అసభ్య పదజాలంతో వేధిస్తూ వెంటపడుతున్నాడు. ఈ విషయాన్ని లేడీ కానిస్టేబుల్ దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థినులు.
మరుసటి రోజు యధావిధిగా స్కూలుకు వెళ్తున్న బాలికలను ఇదే విధంగా వేధించడం మొదలు పెట్టాడు ఆ యువకుడు. వెంటనే రంగంలోకి దిగిన లేడీ కానిస్టేబుల్.. ఆకతాయి కాలర్ పట్టుకుని వీపు విమానం మోత మోగించింది. కాలి షూ తీసి బాదేసింది. ఇంకోసారి ఇలాంటి వెకిలి వేషాలు వేసినట్లు తెలిసిందో ఏరుకోడానికి ఎముకలు కూడా లేకుండా చేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అనంతరం ఓ వారం రోజులు జైల్లో ఉంటే తెలుస్తుంది పదా అని లాక్కెళ్లింది. అమ్మాయిలకు రక్షణగా నిలిచిన పోలీస్ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్సం కురుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.