విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ మిస్సింగ్ కలకలం రేపింది. 44వ డివిజన్.. టీడీపీ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ గత 10 రోజులుగా కనబడడం లేదు. 10రోజుల క్రితం ఇంటి నుంచి ఆఫీస్‌కు వెల్లిన కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్.. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సుర్యారావు పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్.. ఫైనాన్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.