పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థులకు పెను ముప్పు తప్పింది. చాగల్లులో నిర్మలగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థుల్ని వెంటనే కిందకు దింపేశాడు. దీంతో పెనుముప్పు తప్పింది. విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.