అమ్మో పాము.. ఆమె దాన్ని పట్టుకుని.. వీడియో

Update: 2019-12-13 05:49 GMT

పాము.. ఆ పేరు వినాలన్నా, దాన్ని చూడాలన్నా చాలా మందికి భయం. ఓ మహిళ మాత్రం చాలా డేర్‌గా అత్యంత చాకచక్యంగా పాముని పట్టుకుంది. అది చిన్నా చితకా పాము కూడా కాదు.. పట్టుకుందంటే ప్రాణాలు పోవల్సిందే.. అదే భారీగా ఉన్న ఓ కొండచిలువ. కేరళ ఎర్నాకులం ప్రాంతంలో ఓ కొండ చిలువ తిరుగాడుతుందని సమాచారం అందుకుంది విద్య. బీహార్‌కు చెందిన విద్య ఎర్నాకులంలోని పానంపల్లిలో నివసిస్తున్నారు. పాములు పట్టుకునే మహిళగా పేరున్న ఆమె కొండ చిలువను గురించిన సమాచారం అందింది.

ఓ నలుగురు బృదంతో కలిసి కొండచిలువ ఉన్న ప్రాంతానికి వెళ్లింది. మాటు వేసి కొండ చిలువ మెడను పట్టుకుంది. తోకను మరొకరు పట్టుకోవడంతో నేర్పుగా ఓ సంచిలోకి దాన్ని పంపించి ముడి వేసింది. జంతుప్రేమికురాలైన విద్య పాముల్ని పట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తుంది. అలా ఇప్పటి వరకు ఈమె వెయ్యికి పైగా పాముల్ని పట్టుకుందని స్థానికులు విద్య గురించి చెబుతుంటారు. ఎక్కడ పాము కనిపించినా విద్యకి సమాచారం అందిస్తుంటారు.

 

 

Similar News