గుంటూరు బాలిక ఘటనపై స్పందించిన నారా లోకేష్

Update: 2019-12-14 13:57 GMT

గుంటూరు బాలికపై అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. దిశ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన రోజే.. ఇలాంటి దారుణం జరిగిందన్నారాయన. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. చట్టాలు పదునెక్కుతున్నా.. ప్రతి రోజు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ ట్వీట్‌ చేశారు. మహిళలు బయటికి వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిందితుడికి 21 రోజుల్లో శిక్ష పడేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. బాధిత కుుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మహిళలకు భరోసా ఇస్తారని భావిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Similar News