ప్రజాస్వామ్య దేశంలో ట్రేడ్ యూనియన్లు ఉండాలి.. ఎన్నికలు జరపాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. విద్యానగర్ లోఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం అయింది. ఆర్టీసీ యూనియన్ల కోసం రహస్య పద్దతి ద్వారా ఓటింగ్ పెట్టి.. ఉద్యోగుల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. సంక్షేమ కౌన్సిల్‌లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.