మరోవైపు బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గుంటూరు నగరం హోరెత్తిపోతోంది. ఉన్మాదిని వెంటనే శిక్షించాలంటూ మహిళా సంఘాలు, విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో చిన్నారి చికిత్స పొందుతున్న జీజీహెచ్ ఆస్పత్రి ప్రాంగణం అట్టుడికిపోయింది. ఈ ఘటనతోనే ‘దిశా’ చట్టాన్ని అమలు పరిచి.. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై వరుస అత్యాచార ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరవైందా అనే అనుమానాలు రేకెత్తున్నాయి. ఇలాంటి దారుణాలు జరగకుండా మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేలా కృషి చేయాలని కోరుతున్నారు.